అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది ?

Allari Naresh's 'Aa Okti Adakku' new release date has arrived?
Allari Naresh's 'Aa Okti Adakku' new release date has arrived?

కామెడీ యాక్టర్ గా గతంలో ఎన్నో మూవీ ల ద్వారా ఆడియన్స్ మనసు గెలుచుకున్న అల్లరి నరేష్ ఇటీవల ఒకింత యాక్షన్ ఎమోషనల్ మూవీ లు చేస్తూ వచ్చారు. ఇక మళ్ళి తాజాగా తన మార్క్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అంశాలతో కూడిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. జాతి రత్నాలు సినిమా ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ని మల్లి అంకం తెరకెక్కిస్తుండగా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలకా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

Allari Naresh's 'Aa Okti Adakku' new release date has arrived?
Allari Naresh’s ‘Aa Okti Adakku’ new release date has arrived?

ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సాంగ్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సినిమా ని ఏప్రిల్ 19 న ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారట. ఇక ఈ సినిమా న్యూ రిలీజ్ డేట్ పై అతి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుంది. మరి ఈ సినిమా ద్వారా అల్లరి నరేష్ ఏ స్థాయి విజయం అందుకుంటారో చూడాలి.