“ఆ ఒక్కటీ అడక్కు”థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ!

the-production-company-that-owns-the-theatrical-rights-of-aa-okkati-adakku-movie
the-production-company-that-owns-the-theatrical-rights-of-aa-okkati-adakku-movie

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ మరియు ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా ఆ ఒక్కటీ అడక్కు. ఈ మూవీ ఈ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. కొత్త దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. కెప్టెన్ మిల్లర్, జిగర్ తండా డబుల్ ఎక్స్, మామన్నన్ మరియు ఇండియన్ 2 వంటి మూవీ లను పంపిణీ చేయడంలో పేరుగాంచిన ఏషియన్‌ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలోని అన్ని ప్రాంతాల థియేట్రికల్ హక్కులని పొందింది.

the-production-company-that-owns-the-theatrical-rights-of-aa-okkati-adakku-movie
the-production-company-that-owns-the-theatrical-rights-of-aa-okkati-adakku-movie

ఈ కొనుగోలు ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ భారీ స్థాయిలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఒక్కటీ అడక్కు మూవీ లో జామీ లివర్, కల్పలత, హరి తేజ, వెన్నెల కిషోర్, హర్ష చెముడు మరియు అనీష్ కురువిల్లా లు కీలక పాత్రల్లో నటించారు. చిలకా ప్రొడక్షన్స్‌పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ కామెడీ డ్రామా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు .