అల్లరి నరేశ్ మార్క్ ఎంటర్‌మెంట్‌తో.. ‘ఆ ఒక్కటి అడక్కు’ టీజర్

With Allari Naresh Mark Entertainment.. 'That One Thing' Teaser
With Allari Naresh Mark Entertainment.. 'That One Thing' Teaser

అల్లరి నరేష్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ తో అందరినీ ఆకట్టుకుని ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా నుండి టీజర్ ను నేడు రిలీజ్ చేసారు మేకర్స్.

With Allari Naresh Mark Entertainment.. 'That One Thing' Teaser
With Allari Naresh Mark Entertainment.. ‘That One Thing’ Teaser

చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా కి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక టీజర్ లో అల్లరి నరేష్ తన మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో పాటు ఫన్నీ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్ ఫరియా అబ్దుల్లా లుక్స్, డైలాగ్స్ కూడా బాగా అలరించాయి. గ్రాండియర్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కామెడీ సీన్స్ తో మొత్తంగా ఆ ఒక్కటీ అడక్కు టీజర్ అందరినీ అలరిస్తూ ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా సమ్మర్ లో ఈ సినిమా ని ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్.