అల్లరి నరేష్ “ఆ ఒక్కటీ అడక్కు” టీజర్ కు డేట్ ఫిక్స్!

Date fixed for Allari Naresh's
Date fixed for Allari Naresh's "Aa Okti Adakku" teaser!

టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మల్లి అంకం దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ ఆ ఒక్కటీ అడక్కు. ఈ మూవీ తో ఆడియెన్స్ ని మళ్ళీ తనదైన కామెడీ మార్క్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 22, 2024న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు సమాచారం. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

Date fixed for Allari Naresh's "Aa Okti Adakku" teaser!
Date fixed for Allari Naresh’s “Aa Okti Adakku” teaser!

అయితే ఈ మూవీ టీజర్‌ను మార్చి 12, 2024న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఒక సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఆ ఒక్కటీ అడక్కు మూవీ లో జామీ లీవర్, కల్పలత, హరి తేజ, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, అనీష్ కురువిల్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.