International Politics: తమ రాజకీయాల్లో విదేశీ జోక్యంపై దర్యాప్తు చేపట్టిన కెనడా

International Politics: Canada investigates foreign interference in its politics
International Politics: Canada investigates foreign interference in its politics

తమ రాజకీయాల్లో విదేశీ జోక్యంపై దర్యాప్తు చేపట్టిన కెనడా, చైనా ప్రమేయం ఉన్నట్లు నిర్ధరాణకు వచ్చింది. గత 2 ఎన్నికల్లో డ్రాగన్‌ జోక్యం చేసుకున్నట్లు కెనడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ స్పష్టం చేసింది. 2019, 2021లలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు చెందిన లిబరల్‌ పార్టీనే విజయం సాధించడం గమనార్హం.

కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుంటోందంటూ అక్కడి విపక్ష నేతలు ఇటీవల ఆరోపిస్తూ.. విచారణ జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రాగా దర్యాప్తు చేసేందుకు ప్రధాని ట్రూడో అంగీకరించారు. అందుకోసం ఓ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ విచారణలో 2019, 2021 ఎన్నికల్లో ‘పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా’ రహస్యంగా, మోసపూరితంగా జోక్యం చేసుకున్నట్లు తెలిసింది’’ అని కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (CSIS) నివేదిక వెల్లడించింది. రెండు సందర్భాల్లోనూ తమకు అనుకూలంగా, తటస్థంగా ఉన్నవారికి మద్దతు ప్రకటించిందని వెల్లడించింది. ఈ వ్యవహారంలో ప్రధాని ట్రూడో ఇవాళ కమిషన్‌కు వాంగ్మూలం ఇవ్వనున్నారు. మరోవైపు.. కెనడా రాజకీయాల్లో జోక్యంపై వచ్చిన వార్తలను చైనా ఖండించింది.