Election Updates: ఇవాళ్టి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు

Election Updates: Brahmotsavam at Ontimitta Kodanda Ram Temple from today
Election Updates: Brahmotsavam at Ontimitta Kodanda Ram Temple from today

కడప జిల్లాలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 25 వరకు జరగనున్నారు బ్రహ్మోత్సవాలు. ఈ శ్రీరామనవమి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసింది టిటిడి.

ఇవాళ ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానుంది. ఈ నెల 20న హనుమంత వాహనంపై దర్శనం ఇవ్వనున్నారు రాముల వారు. అలాగే.. ఈ నెల 21న గరుడసేవ నిర్వహణ ఉండనుంది. ఈ నెల 22న పండు వెన్నెలలో కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 26న పుష్ప యాగంతో ముగియనున్నాయి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు.