కాజల్ ‘సత్యభామ’ రిలీజ్ డేట్ వచ్చేసింది … ఎప్పుడో తెలుసా ..!

Kajal's 'Satyabhama' release date has arrived ... do you know when ..!
Kajal's 'Satyabhama' release date has arrived ... do you know when ..!

టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ఒకరైన కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా సత్యభామ. కాజల్ కెరీర్ 60వ మూవీగా వస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్‌ గ్లింప్స్ వీడియో అందరినీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ క్రైం థ్రిల్లర్‌ జానర్ సినిమా కి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తుండగా శ్రీనివాసరావు తక్కలపెల్లి, బాబీ టిక్కా నిర్మిస్తున్నారు. ఇక తాజాగా సత్యభామ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు మేకర్స్‌.

Kajal's 'Satyabhama' release date has arrived ... do you know when ..!
Kajal’s ‘Satyabhama’ release date has arrived … do you know when ..!

ఇక విడుదల తేదీని స్టైలిష్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ద్వారా మే 17 గా ప్రకటించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది . ఈ సినిమా లో కాజల్ అగర్వాల్‌ పవర్ఫుల్ పోలీసాఫీసర్‌ సత్యభామగా కనిపించబోతున్నట్టు గ్లింప్స్‌, టీజర్‌తో ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చేశారు డైరెక్టర్‌. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమా కి విష్ణు బేసి ఫోటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం సత్యభామ ఏ స్థాయి సక్సెస్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.