‘మిస్టర్‌ మజ్ను’తో కాజల్‌కు పనేంటి…?

Akhil Upcomming Movie Mister Majnu

అఖిల్‌ ఇప్పటి వరకు చేసిన రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. అఖిల్‌ మూడవ సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయినట్లుగా సమాచారం అందుతుంది. తొలి ప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రంకు దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కీలక పాత్రలో ముద్దుగుమ్మ, సీనియర్‌ హీరోయిన్‌ కాజల్‌ కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

majnu

అఖిల్‌కు అన్న అయిన నాగచైతన్యతో కలిసి నటించి మెప్పించిన కాజల్‌ ఇప్పుడు అఖిల్‌ మూవీలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అఖిల్‌ మూడవ సినిమా ‘మిస్టర్‌ మజ్ను’లో కాజల్‌ పాత్రపై ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ చిత్రంలో కాజల్‌ కేవలం ఐటెం సాంగ్‌ను మాత్రమే చేయనుందా లేదంటే సినిమాలో కీలకమైన క్యారెక్టర్‌ను పోషిస్తుందా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మిస్టర్‌ మజ్ను చిత్రంను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌ ప్లే బాయ్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. అందుకే పలువురు ముద్దుగుమ్మలు ఈ చిత్రంలో ఉండాల్సి ఉంది. అందుకే కాజల్‌ను ఎంపిక చేసి ఉంటారు అనేది కొందరి అభిప్రాయం.

mr-magnu