అల్లరోడు ముంచేశాడు.. మరి ఎన్టీఆర్‌..?

Sunil Re-Entry Hopes on Aravinda Sametha

కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న సునీల్‌ హీరోగా ‘అందాల రాముడు’ చిత్రంతో మారిపోయాడు. ఆ చిత్రం విజయం సాధించడంతో పాటు, ఆ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత అనుకోని అవకాశం మాదిరిగా ‘మర్యాద రామన్న’ చిత్రంలో హీరోగా నటించే అవకాశం దక్కింది. అక్కడ నుండి సునీల్‌ వెనుదిరిగి చూసుకోలేదు. అయితే ఈమద్య సునీల్‌కు హీరోగా సక్సెస్‌లు దక్కడం లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కమెడియన్‌గా మారాల్సిన పరిస్థితి వచ్చింది. కమెడియన్‌గా సునీల్‌ ‘సిల్లీ ఫెల్లోస్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లరి నరేష్‌ నటించిన ‘సిల్లీ ఫెలోస్‌’ చిత్రంలో సునీల్‌ కమెడియన్‌గా రాణించలేక పోయాడు.

Aravinda Sametha Veera Raghava

సునీల్‌లోని కమెడియన్‌ను దర్శకుడు భీమినేని ఉపయోగించుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు సునీల్‌ ఆశలన్నీ కూడా అరవింద సమేత చిత్రంపైనే ఉన్నాయి. మిత్రుడు అయిన త్రివిక్రమ్‌ ఖచ్చితంగా ఒక మంచి పాత్రను సునీల్‌ కోసం అరవింద సమేత చిత్రంలో క్రియేట్‌ చేసి ఉంటాడు అంటూ సమాచారం అందుతుంది. దసరా కానుకగా రాబోతున్న అరవింద సమేత చిత్రంలో సునీల్‌ నవ్విస్తేనే ఇకపై సినిమాల్లో ఈయనకు ఛాన్స్‌లు వస్తాయి. సునీల్‌ కామెడీని ప్రేక్షకులు ఇంకా ఆధరిస్తారా లేదా అనేది కూడా అరవింద సమేత చిత్రంతో తేలిపోయే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అరవింద సమేత చిత్రం తర్వాత సైరా చిత్రంలో కూడా సునీల్‌ కనిపించబోతున్నాడు. అయితే సైరా చిత్రంలో సునీల్‌కు పెద్దగా స్కోప్‌ ఉండదని ప్రచారం జరుగుతుంది. సునీల్‌ కెరీర్‌ ఎలాంటి టర్న్‌ తిరుగుతుందో చూడాలి.