ఓటిటి చిక్కుల్లో “ఓజి”: ట్విస్ట్ ఏంటి అంటే … !

"OG"movie in OTT : What is the twist... !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు భారీ మూవీ ల్లో రెండు పాన్ ఇండియా మూవీ లు ఉండగా ఈ మూవీ ల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ యాక్షన్ డ్రామా “ఓజి” (They Call Him OG) కూడా ఒకటి. అయితే ఈ మూవీ పై ఒక్క గ్లింప్స్ తో సెన్సేషనల్ హైప్ వచ్చింది.

"OG"movie in OTT : What is the twist... !
“OG”movie in OTT : What is the twist… !

పైగా ఈ వీడియోకు థియేటర్స్ లో దద్దరిల్లే రెస్పాన్స్ కూడా వస్తోంది . కానీ ఇక్కడ అనూహ్యంగా ఊహించని ట్విస్ట్ ఏమిటంటే ఇలాంటి మూవీ కి ఇంకా ఓటిటి డీల్ పూర్తి కానట్టు తెలుస్తోంది . ఆల్రెడీ సెప్టెంబర్ 27 రిలీజ్ అని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఈ డేట్ లోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి అని అర్ధం అవుతుంది .

ఇందుకు ప్రధాన కారణం ఇంకా మూవీ కి ఓటిటి డీల్ పూర్తి కాకపోవడమే అన్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి . భారీ హైప్ ఉన్న ఈ మూవీ కి ఇంకా ఓటిటి డీల్ ఖరారు కాకపోవడం అనేది ఒకింత ఆశ్చర్యం అని చెప్పుకోవాలి . మరి చూడాలి ఈ మూవీ కి ఏమవుతుంది అనేది.