ముంబైలో న‌గ‌ల బిజినెస్ చేస్తున్న కాజ‌ల్‌

kajal doing business in mumbai

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అగ్రహీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది ముంబై బ్యూటీ కాజల్ అగర్వాల్. తనకు వచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని టాప్ హీరోయిన్‌గా మారిన కాజల్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ప‌లు ప్ర‌క‌ట‌న‌ల‌లో న‌టిస్తూ ఉంటుంది. ఇంకా పెళ్లి పీట‌లెక్క‌ని ఈ అమ్మ‌డు ఇటీవ‌ల నిర్మాత అవ‌తారం కూడా ఎత్తింది. KA వెంచర్ పేరుతో ఓ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ మొద‌లు పెట్టింది. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తొలి సినిమా చేయ‌నున్న‌ట్టు టాక్. ఇక ఇప్పుడు ఏకంగా ముంబైలో సొంతంగా న‌గ‌ల దుకాణాన్ని ఓపెన్ చేసింద‌ట‌. తాను సంపాదించిన మొత్తాన్నంతా బిజినెస్‌లో పెట్టి మ‌రింత లాభాల‌ని ఆర్జించాల‌ని అమ్మ‌డి ప్లాన్‌గా తెలుస్తుంది. కాజ‌ల్‌కి త‌న సోద‌రి నిషా అగ‌ర్వాల్ కూడా మంచి స‌పోర్ట్ ఇస్తుంద‌ట‌. షూస్ కంపెనీ కూడా ఒక‌టి కాజ‌ల్ పేరు మీద ఉందని స‌మాచారం. మొత్తానికి 36ఏళ్ళ వ‌య‌స్సు ఉన్న కాజ‌ల్ త‌న సొంత తెలివి తేట‌ల‌తో అన్ని ర‌కాలుగా ఫ్యూచ‌ర్‌ని సెట్ చేసుకుంటుంది.