వామ్మో….నలభై మంది పురుషుల మీద రేప్ ?

rape on forty men

మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన ఘటనలు చాలానే చూస్తూ ఉన్నాం. కానీ ఒక ఇక్కడ మాత్రం సీన్ రివర్స్.. తి మాత్రం అందుకు భిన్నంగా వయసుతో సంబంధం లేకుండా, మగాళ్లు, ట్రాన్స్‌జెండర్లే టార్గెట్ గా కనిపిస్తే చాలు లాక్కెళ్లి అత్యాచారం చేస్తాడు. జైపూర్‌లోని శాస్త్రీనగర్‌ చెందిన ఏడేళ్ల బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు.. తర్వాత చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. దగ్గరలోని సీసీ కెమెరా ఫుటేజ్‌‌ను పరిశీలించారు. ఓ వ్యక్తి ముసుగు ధరించినట్లు గుర్తించారు. అతడు బైక్‌పై వెళ్లడాన్ని గమనించి నంబర్ ఆధారంగా ఆరా తీశారు. మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి అదే బైక్‌పై వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిందితుడు జీవాను ప్రశ్నించిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిశాయి. ఈ నిందితుడు 40మందిపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్నాడట. వీరిలో అందరూ పురుషులు, ట్రాన్స్‌జెండర్లు ఉన్నారన్నాడు. గతంలో పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేసేవాడినని చెప్పాడు. గతంలో అతడిపై చాలా కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. ఓ బాలుడిపై అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడినందుకు 2004లో అరెస్టయ్యాడట. 2015లో అతడికి కోర్టు బెయిలు మంజూరు చేయగా జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడ్డాడు.