25 సెంటర్లలో 100 రోజులను పూర్తి చేసుకున్న “హనుమాన్”మూవీ ..!

"Hanuman" movie completed 100 days in 25 centers ..!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో సినిమా హను మాన్ (Hanuman). ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు కూడా రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం కూడా జరిగింది. ఈ మూవీ తాజాగా 25 సెంటార్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

"Hanuman" movie completed 100 days in 25 centers ..!

“Hanuman” movie completed 100 days in 25 centers ..!

అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్ర ఖని  తదితరులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ల లో, డిజిటల్ గా సూపర్ రెస్పాన్స్ ని కొల్లగొట్టిన ఈ మూవీ , ఈ 28 వ తేదీన జీ తెలుగు లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నది .