గుడ్ న్యూస్ : “మిరాయ్”సెట్స్ లో మంచు మనోజ్!

Manchu Manoj on the sets of "Mirai"!
Manchu Manoj on the sets of "Mirai"!

హను మాన్ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ మిరాయ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజైన టైటిల్ గ్లింప్స్ వీడియో ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ లో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Manchu Manoj on the sets of "Mirai"!
Manchu Manoj on the sets of “Mirai”!

లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, నటుడు ఇటీవలే మిరాయ్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు . ఇదే విషయాన్ని పరోక్షంగా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో ప్రకటించారు . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. గౌర హరి ఈ మూవీ కి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 18, 2025న 7 భాషల్లో మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.