“మిస్టర్ బచ్చన్ “షూటింగ్ లో ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Interesting update on
Interesting update on "Mr. Bachchan" shooting!

డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో, మాస్ మహారాజ రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). ఈ మూవీ లో భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి సంబందించిన షూటింగ్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదిక గా కీలక అప్డేట్ ని అందించారు.

Interesting update on "Mr. Bachchan" shooting!
Interesting update on “Mr. Bachchan” shooting!

30 రోజుల పాటు జరిగిన లాంగ్ అండ్ ఇంటెన్స్ షెడ్యూల్ కి సంబందించిన షాట్ ని పోస్ట్ చేశారు. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యింది అని, త్వరలో హైదరాబాద్ లో కలుద్దాం అని కూడా అన్నారు. అంతేకాక ఈ షెడ్యూల్ లో సహకరించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకి థాంక్స్ తెలిపారు హరీష్. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.