‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ నుంచి సితార్ సాంగ్ ప్రోమో.. అదుర్స్ ..!

Sitar song promo from 'Mr Bachchan'.. Adurs ..!
Sitar song promo from 'Mr Bachchan'.. Adurs ..!

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా మూవీ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో చాలా బిజీగా ఉంది. ఈ మూవీ ను ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ సినిమా పై అంచ‌నాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ మూవీ నుంచి సితార్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేయ‌డంతో ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

తొలుత ఈ సాంగ్ ని జూలై 8న రిలీజ్ చేస్తామ‌ని చెప్పిన మేక‌ర్స్ కొన్ని కార‌ణాల వ‌ల్ల రిలీజ్ డేట్ ని జూలై 10కి మార్చారు. అయితే, ఈ సాంగ్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. చ‌క్క‌టి మెలోడి మ్యూజిక్ తో ఉన్న ఈ ప్రోమో అభిమాన‌ల‌తో డ్యాన్స్ వేయించేలా ఉన్నది . ఈ పాట‌లో ర‌వితేజ వింటేజ్ లుక్ లో క‌నిపిస్తున్నారు . ఇక ఆయ‌న వేసిన స్టెప్పు ఫ్యాన్స్ కి పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేస్తుంది.

Sitar song promo from 'Mr Bachchan'.. Adurs ..!
Sitar song promo from ‘Mr Bachchan’.. Adurs ..!

ఈ సినిమాలో అందాల భామ భాగ్య‌శ్రీ బొర్సె హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, జ‌గ‌ప‌తి బాబు విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. జూలై 10న రిలీజ్ అయ్యే సితార్ సాంగ్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.