మోక్షజ్ఞ స్పెషల్ రోల్.. ఇది నిజమేనా ?

Mokshajna special role.. is this true?
Mokshajna special role.. is this true?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఏంటో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య బాలకృష్ణ కూడా.. తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. మరోవైపు ‘అఖండ 2’ మూవీ షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్ట్ లు కూడా పెడుతున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ, ‘అఖండ 2’ షూటింగ్ కు లింక్ కుదిరిందని టాక్. ‘అఖండ 2’ మూవీ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యింది.

Mokshajna special role.. is this true?
Mokshajna special role.. is this true?

దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి మోక్షజ్ఞ కోసం ఒక స్పెషల్ రోల్ రాశాడని.. సెకండ్ హాఫ్ లో మోక్షజ్ఞ పాత్ర వస్తోందని తెలుస్తుంది . ఇప్పటికే, మోక్షజ్ఞ పై టెస్ట్ షూట్ కూడా చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఏ మాత్రం నిజం ఉన్నా.. నందమూరి అభిమానులకి శుభవార్తే. ఇక కథ ప్రకారం.. మూవీ పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తుంది .

అలాగే..హిందూ దేవాలయాలకి సంబదించిన లింక్స్ తో పాటు దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ మూవీ లో బాగా ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది.