గుడ్ న్యూస్:కూతురి పేరుని ప్ర‌క‌టించిన మంచు మ‌నోజ్..!

Good news: Manchu Manoj announced the name of the daughter..!
Good news: Manchu Manoj announced the name of the daughter..!

టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ భార్య‌ మౌనిక ఇటీవ‌ల ఒక ఆడ‌బిడ్డకి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో మంచు ఫ్యామిలీలో అందరికి సంతోషం మ‌రింత పెరిగింది. అయితే, తాజాగా త‌మ కూతురికి నామ‌క‌ర‌ణం కూడా చేశారు ఈ యంగ్ హీరో.

త‌న గారాల‌పట్టి అయిన‌ కూతురికి ”దేవ‌సేన శోభా”గా నామ‌క‌ర‌ణం చేసిన‌ట్లు మంచు మనోజ్ తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. సుభ్ర‌హ్మ‌ణ్య స్వామి భార్య పేరైన‌ దేవ‌సేన‌.. అలాగే తన అత్త‌గారు శోభా నాగిరెడ్డి పేరులోని శోభా ని క‌లిపి త‌న కూతురికి ”దేవ‌సేన శోభా” అనే పేరుని పెట్టిన‌ట్లుగా మంచు మ‌నోజ్ తెలిపాడు.

Good news: Manchu Manoj announced the name of the daughter..!
Good news: Manchu Manoj announced the name of the daughter..!

త‌న కూతురికి అంద‌రి ఆశీస్సులు ఉండాల‌ని, ఆ ప‌ర‌మశివుడు త‌మ‌పై ఇలాంటి కృప‌ని కొన‌సాగించాల‌ని మంచు మ‌నోజ్ ఈ సంద‌ర్భంగా కోరారు . ఇక త‌న ఫ్యామిలీతో క‌లిసి దిగిన ఫోటోని ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు.