‘స్పిరిట్‌’లో ప్రభాస్ పాత్ర ఏంటో తెలుసా ?

Do you know the role of Prabhas in 'Spirit'?
Do you know the role of Prabhas in 'Spirit'?

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్‌’ అనే మూవీ చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌ పనుల్లో సందీప్ రెడ్డి బిజీగా ఉన్నారు. మరోవైపు ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, తాజాగా ప్రభాస్ పాత్ర పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. పవర్ ఫుల్ మాఫియా డాన్ గా ప్రభాస్ పాత్ర ఉండబోతోందని, ముఖ్యంగా ప్రభాస్ పాత్రలోని డెప్త్ కూడా నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది .

Do you know the role of Prabhas in 'Spirit'?
Do you know the role of Prabhas in ‘Spirit’?

అలాగే, ఈ మూవీ లో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారని.. అందులో ఒకటి పక్కా మాస్ లుక్‌ అని, ఆ లుక్ లో ప్రభాస్ నిజంగా ప్రేక్షకులకి షాక్ ఇస్తాడని అంటున్నారు. పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ తో ప్రభాస్ సరికొత్త గెటప్ లో కనిపిస్తాడతా అదేవిధంగా ప్రభాస్ రెండో లుక్ కూడా సూపర్ స్టైలిష్ గా హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉంటుందంట . అన్నట్టు ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో అదే ఈ మూవీ లో ఉంటుందట. ఇప్పటికే, 80 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. రూ.300 కోట్లకి పైగా బడ్జెట్‌ తో ఈ మూవీ తెరకెక్కనుంది.