త్వరలో థియేటర్ల లోకి వచ్చేస్తున్నా “1000 వాలా”..!

"1000 Wala" is coming to the theaters soon..!

సూపర్ హిట్ సినిమా మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో నూతన నటుడు అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న మూవీ 1000 వాలా. టెన్ రూపీస్ మూవీ తో విమర్శకుల ప్రశంసలు పొందిన అఫ్జల్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ అంత పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది.

"1000 Wala" is coming to the theaters soon..!
“1000 Wala” is coming to the theaters soon..!

అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా లో అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియా లో వచ్చిన స్పందన చూసి దర్శక నిర్మాతలు కూడా మాట్లాడుతూ, మా 1000 వాలా మూవీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియా ప్రేక్షకులని ఆకట్టుకుంది. లైక్స్ మరియు కామెంట్స్ చూసి మా మూవీ తప్పక విజయం సాధిస్తుంది అని బాగా నమ్మకం కలిగింది. షూటింగ్ అంత పూర్తి అయింది. ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. త్వరలో విడుదల చేస్తాం అని తెలియచేసారు .

అమిత్, షారుఖ్, నమిత, కీర్తి, సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్, తదితరులు నటించిన ఈ మూవీ కి కథ అమిత్, కథనం, మాటలు గౌస్ ఖాజా, కెమెరా చందు ఏజె, డి ఐ రవితేజ, డాన్స్ బాలు మాస్టర్, సూర్య కొలుసు, ఫైట్స్ డైనమిక్ మధు, సంగీతం వంశీకాంత్ రేఖాన, నిర్మాత షారుఖ్, దర్శకత్వం అఫ్జల్ లుగా వ్యవహరిస్తున్నారు.