గుడ్ న్యూస్ : టీవీ ప్రీమియర్ కు రెడీ అయిన “సుందరం మాస్టర్”

Good news:
Good news: "Sundaram Master" ready for TV premiere

ప్రముఖ కమెడియన్ హర్ష చెముడు టైటిల్ రోల్ లో, డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ సుందరం మాస్టర్. ఈ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి, ప్రేక్షకులని అలరించడం లో విఫలం అయ్యింది. ఈ మూవీ ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నది . ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులని సొంతం చేసుకుంది.

Good news: "Sundaram Master" ready for TV premiere
Good news: “Sundaram Master” ready for TV premiere

ఈ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ఈటీవీ లో సుందరం మాస్టర్ ప్రసారం కానున్నది . దివ్య శ్రీపాద, బాలకృష్ణ నీలకంటపు, భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ మూవీ కి టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ మరియు సుధీర్ కుమార్ లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. బుల్లితెర పై ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.