గుడ్ న్యూస్ : పుష్ప-2 మూవీ నుంచి సెకండ్ సాంగ్ వచ్చేస్తుంది … !

Good news: Second song from Pushpa-2 movie is coming... !
Good news: Second song from Pushpa-2 movie is coming... !

స్టార్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో పుష్ప- 2 పాన్ ఇండియా సినీమా గా రాబోతుంది. 2021లో వచ్చిన పుష్ప సినిమాకు సిక్వెల్ గా రాబోతుంది. ఇందులో హీరోయిన్గా రష్మిక, విలన్ ఫహద్ ఫాజల్ కనిపించబోతున్నాడు . అయితే ఇప్పటివరకు పుష్ప-2 నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చిన సూసేకి అగ్గి రవ్వ మాదిరి సాంగ్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేసింది.

Good news: Second song from Pushpa-2 movie is coming... !
Good news: Second song from Pushpa-2 movie is coming… !

తాజాగా, పుష్ప-2 సెకండ్ సాంగ్ ఫుల్ వీడియోకు టైమ్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని తెలుపుతూ రష్మిక మందన్నా ఓ స్పెషల్ పోస్టర్ ని తెలిపింది . అల్లు అర్జున్ తో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ పుష్ప-2 సూసేకి సాంగ్ మే 29న ఉదయం 11. 07 నిమిషాలకు రానున్నట్లు వెల్లడించింది అలాగే మీ పుష్పతో శ్రీవల్లీ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే రష్మిక షేర్ చేసిన పోస్టర్లో అల్లు అర్జున్ ఎదపై రష్మిక సంతోషంగా వాలినట్లు కనిపిస్తుంది . ప్రస్తుతం ఈ పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా పుష్ప-2 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది