గుడ్ న్యూస్ : తేజ సజ్జ న్యూ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్

Good news: Teja Sajja new movie announcement poster
Good news: Teja Sajja new movie announcement poster

ఇటీవల హను మాన్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్నారు యువ నటుడు తేజ సజ్జ. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఆ సినిమా లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. ఇక తాజాగా ఈగిల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా రూపొందనున్న సినిమా యొక్క అనౌన్స్ మెంట్ పోస్టర్ నేడు వచ్చింది.

Good news: Teja Sajja new movie announcement poster
Good news: Teja Sajja new movie announcement poster

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి 36వ ప్రాజక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమా యొక్క టైటిల్ తో పాటు గ్లింప్స్ ను ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. గౌర హరి సంగీతం అందించనున్న ఈ సినిమా లో రితికా నాయక్ హీరోయిన్ గా నటించనుండగా మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తుంది . త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి.