“హను మాన్”మూవీ : ప్రశాంత్ వర్మ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ !

"Hanu Maan" Movie : Interesting update from Prashant Varma!

ప్రస్తుతం మన టాలీవుడ్ మూవీ ఏ రేంజ్ లో షైన్ అవుతుందో చూస్తున్నాం. మరి ఈ ఏడాది జనవరిలో వచ్చిన చిన్న మూవీ పెద్ద విజయాన్ని సాధించింది. మరి ఆ మూవీ నే మన తెలుగు సూపర్ హీరో మూవీ “హను మాన్” (Hanu Man Movie). యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది.

"Hanu Maan" Movie : Interesting update from Prashant Varma!
“Hanu Maan” Movie : Interesting update from Prashant Varma!

అయితే ఈ మూవీ సాధించిన అఖండ విజయం ఇప్పుడు 100 రోజులు కూడా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఒక్క థియేటర్ లోనే 100 రోజులు ఓ మూవీ ఆడటం అనేది గగనం అయిపోయిన తరుణంలో 25 సెంటర్స్ లో హను మాన్ రన్ అయ్యి సెన్సేషన్ సెట్ చేసుకుంది. అయితే ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ ట్రిపుల్ ఏ మూవీ స్ లో స్పెషల్ షో తర్వాత ప్రెస్ మీట్ ను పెడుతున్నట్టుగా తెలిపాడు.

అయితే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి . మెయిన్ గా “హను మాన్” తర్వాత వస్తున్నా “జై హనుమాన్” (Jai Hanuman Movie) పై రెట్టింపు ఆసక్తి ఉన్నది . మొన్న రామనవమి కానుకగా వచ్చిన అప్డేట్ తో మరింత హైప్ ను జెనరేట్ చేయగా ఇప్పుడు హనుమాన్ జయంతి కూడా కావడంతో నేడు ఆసక్తికర అప్డేట్స్ ను ఇచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. మరి వేచి చూడాలి ప్రశాంత్ వర్మ ఎలాంటి డీటెయిల్స్ ఇస్తారో అనేది.