బుల్లితెర పై “హనుమాన్” కి సూపర్ రెస్పాన్స్!

Super response to "Hanuman" on the big screen!
Super response to "Hanuman" on the big screen!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో సినిమా హను మాన్ (Hanuman). ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ మూవీ ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మూవీ కు సంబందించిన టీఆర్పీ రేటింగ్ వెలువడింది.

Super response to "Hanuman" on the big screen!
Super response to “Hanuman” on the big screen!

ఈ మూవీ 10.26 టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పుకోవాలి బుల్లితెర పై ఈ ఏడాది ఆదికేశవ (10.47) తర్వాత హనుమాన్ కు అత్యధికంగా రేటింగ్ వచ్చింది. అమృత అయ్యర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల ల్లో నటించారు.