ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో అనుపమ పరమేశ్వరన్ చాలా బిజీ .!

Anupama Parameswaran is very busy with interesting projects.
Anupama Parameswaran is very busy with interesting projects.

రీసెంట్ గా టాలీవుడ్ నుంచి వచ్చిన క్రేజీ హిట్ మూవీ ల్లో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన మూవీ “టిల్లు స్క్వేర్” (Tillu Square) కూడా ఒకటి. తెలుగులో కొంచెం గ్యాప్ తర్వాత అందులోని మంచి గ్లామరస్ రోల్ లో అనుపమ చేసిన మొదటి మూవీ ఇది కావడంతో మంచి బజ్ నెలకొంది.

ఇక ఎట్టకేలకు అనుపమ సాలిడ్ హిట్ ను అందుకోగా ఈ మూవీ తర్వాత అనుపమ నుంచి మరిన్ని క్రేజీ మూవీ లు రాబోతున్నాయి. ఇప్పుడు టిల్లు స్క్వేర్ తర్వాత మొత్తం 5 మూవీ లు అనుపమ నుంచి ఉన్నాయి. వాటిలో హను మాన్ (Hanu Man) దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) తో ఆక్టోపస్ (వర్కింగ్ టైటిల్) అనే మూవీ చేస్తుండగా దీని తర్వాత “సినిమా బండి” దర్శకుడితో “పరదా” అనే మూవీ అనౌన్స్ చేసింది.

ఇక తమిళ్ నుంచి “పెట్ డిటెక్టివ్” అనే మూవీ ని ప్రణీష్ విజయన్ దర్శకుడు చేస్తుండగా మరో క్రేజీ ప్రాజెక్ట్ “బైసన్” ధృవ్ విక్రమ్ హీరోగా మరి సెల్వరాజ్ దర్శకత్వంలో పా రంజిత్ ఒక నిర్మాతగా చేస్తున్నాడు . ఇక ఫైనల్ గా “లాక్ డౌన్” అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ను ఏ ఆర్ జీవా దర్శకత్వంలో భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో ఆమె చేస్తుంది. ఇలా మొత్తానికి అయితే ఒక క్రేజీ లైనప్ తోనే అనుపమ ఇక బిజీ బిజీగా ఉండనుంది అని చెప్పుకోవాలి .