“ఎన్టీఆర్ 31” టైటిల్ పై రెండు ఇంట్రెస్టింగ్ అంశాలు.!

Two interesting facts about the title
Two interesting facts about the title "NTR 31".

గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు భారీ మూవీ “దేవర” (Devara) సహా “వార్ 2” (War 2) మూవీ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ లతో పాటుగా సెన్సేషనల్ కాంబినేషన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ పై కూడా ఎనలేని హైప్ నెలకొంది. ఇక ఈ మూవీ విషయంలో రీసెంట్ గానే ఒక పవర్ఫుల్ టైటిల్ “డ్రాగన్” ను లాక్ చేసారని కొన్ని వార్తలు వైరల్ గా మారాయి.

అయితే ఇప్పుడు ఇదే టైటిల్ సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. మొదటగా ఈ మూవీ కి టైటిల్ ఇప్పుడు లాక్ అయ్యింది కాదట ఎప్పుడో 2022 లోనే లాక్ అయ్యినట్టుగా వినిపిస్తుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ (Karan Johar) ని రిక్వెస్ట్ చేయగా అప్పటికే తాను రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ని తారక్ కోసం తన మీద ఉన్న అభిమానంతో కరణ్ వదులుకున్నాడని తెలుస్తుంది.

Two interesting facts about the title "NTR 31".
Two interesting facts about the title “NTR 31”.

ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఇదే “డ్రాగన్” టైటిల్ ను తమిళ్ మూవీ వాళ్ళు కూడా లాక్ చేసుకున్నారంట . యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (లవ్ టుడే ఫేమ్) తో మూవీ కి ఓ దర్శకుడు లాక్ చేసుకున్నాడని ఈ మూవీ తెలుగులో కూడా ఇదే పేరిట రిలీజ్ ప్లాన్ లు చేస్తున్నారనీ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే ఎన్టీఆర్ 31 టైటిల్ విషయంలో ఆసక్తికర పరిణామాలే చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి .