సూపర్ హీరో నిర్మాణ సంస్థతో సిద్ధార్థ్ కొత్త మూవీ ..!

Siddharth's new movie with superhero production company..!
Siddharth's new movie with superhero production company..!

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ హీరోగా నటించిన రీసెంట్ మూవీ “చిన్నా” తో మంచి హిట్ అందుకోగా తెలుగులో కూడా మరోసారి మంచి బజ్ ని తాను అందుకున్నారు . అయితే ఇప్పుడు సిద్ధార్థ్ లేటెస్ట్ గా కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడు. కోలీవుడ్ లో టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ తో ఇంట్రెస్టింగ్ సూపర్ హీరో మూవీ “మహావీరుడు” చేసిన నిర్మాణ సంస్థ శాంతి టాకీస్ వారు కాంబినేషన్ లో చేయబోతున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు.

Siddharth's new movie with superhero production company..!
Siddharth’s new movie with superhero production company..!

ఈ మూవీ ని దర్శకుడు శ్రీ గణేష్ వర్క్ చేయనుండగా ఈ మూవీ సిద్ధార్థ్ కెరీర్ లో 40వ మూవీ గా తెరకెక్కనుంది. అయితే ఈ మూవీ ని కూడా ఒక గ్లోబల్ రీచ్ ఉండే కాన్సెప్ట్ తోనే తెరకెక్కిస్తున్నట్టుగా తెలుపుతున్నారు. అలాగే ఈ జూన్ నుంచే మూవీ స్టార్ట్ కానున్నట్టుగా వినిపిస్తుంది. అలాగే ఇతర కాస్ట్ సహా సాంకేతిక వర్గం కి సంబంధించిన వివరాలు మున్ముందు రానున్నాయి.