“జై హనుమాన్” పై మరిన్ని డీటెయిల్స్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ..!

Prashant Varma gave more details on
Prashant Varma gave more details on "Jai Hanuman"..!

టాలీవుడ్ నుంచి వచ్చిన రీసెంట్ పాన్ ఇండియా భారీ హిట్ మూవీ “హను మాన్”. మన తెలుగు నుంచి వచ్చిన మొదటి సూపర్ హీరో మూవీ ఇది కాగా దీనికి భారీ వసూళ్ళు కూడా నమోదు అయ్యాయి. ఇక ఈ మూవీ కి సెన్సేషనల్ సీక్వెల్ “జై హనుమాన్” ని అనౌన్స్ చేయగా దీనిపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Prashant Varma gave more details on "Jai Hanuman"..!
Prashant Varma gave more details on “Jai Hanuman”..!

దీనితో ఈ మూవీ ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా నిన్న హను మాన్ 100 రోజుల వేడుకల్లో అనుకున్నట్టే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పై ఆసక్తికర అప్డేట్స్ ని అందించాడు. జై హనుమాన్ లో భారీ తారాగణం ఉంటుంది అని తేజ సజ్జ అలాగే నటుడు సముద్రఖని పాత్రలు కొనసాగుతాయని అలాగే సాంకేతిక విలువలు పరంగా కూడా జై హనుమాన్ అద్భుతంగా ఉంటుంది అని ప్రశాంత్ వర్మ తెలియజేసారు .

వీటితో పాటుగా మంచి ఎమోషన్స్, కంటెంట్ పరంగా కూడా జై హనుమాన్ అందరినీ ఆకట్టుకుంటుంది అని ప్రశాంత్ తెలిపాడు. మొత్తానికి అయితే ఈ మాటలతో ఈ మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి అని చెప్పవచ్చు.