తలైవర్ “కూలీ” రిలీజ్ ఈ ఫార్మాట్ లో ఉంటుంది ..!

Thalaivar's
Thalaivar's "Coolie" release will be in this format..!

కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేస్తున్న లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామా “కూలీ” కోసం అందరికి తెలిసిందే. మరి రజినీకాంత్ కెరీర్ లో 171వ మూవీ గా ఇది కాగా ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్ తో తలైవర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయ్యారు. అయితే ఈ మూవీ విషయంలో లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ బజ్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

Thalaivar's "Coolie" release will be in this format..!
Thalaivar’s “Coolie” release will be in this format..!

దీని ప్రకారం లోకేష్ కనగరాజ్ గత మూవీ లియో తరహాలో ఈ మూవీ కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్ లోనే చిత్రీకరణ చేస్తుండగా ఇదే ఫార్మాట్ లో రిలీజ్ చేయనున్నారంట . దీనితో సౌత్ నుంచి మరో మూవీ ఐమ్యాక్స్ రిలీజ్ కు రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లోకేష్ ఈ మూవీ స్క్రిప్ట్ కోసం సుమారు 6 నెలలు వెచ్చించాడు. అలాగే మరో 6 నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసే ప్లాన్ చేస్తున్నారు . అలాగే ఈ మూవీ ని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.