లియో: 100 థియేటర్లలో అన్‌స్టాపబుల్ రీ రిలీజ్

లియో: 100 థియేటర్లలో అన్‌స్టాపబుల్ రీ రిలీజ్
Cinema News

అక్టోబర్ 19 న దసరా పండుగ సందర్భంగా విడుదలైన సినిమా లియో. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 600 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్‌ను అధిగమించి 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమా గా నిలిచింది.

లియో: 100 థియేటర్లలో అన్‌స్టాపబుల్ రీ రిలీజ్
Leo Movie

ఇప్పుడు, తమిళ ఫిల్మ్ సర్కిల్స్ నుండి వస్తున్న తాజా అప్డేట్‌ల ప్రకారం, లియో తమిళనాడు అంతటా 100కి పైగా స్క్రీన్‌లలో రీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది . రీ రిలీజ్ ప్లాన్ వెనుక కారణం టిక్కెట్ కౌంటర్లలో మంచి వసూళ్లను సాధించగల మంచి మూవీ లు ఏమీ లేకపోవడం. 5వ వారంలో కూడా లియో బాక్సాఫీస్ వద్ద మంచి రన్‌ను కొనసాగిస్తుంది . త్రిష, సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించిన లియోను ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.