ఏపీ రైతులకు శుభవార్త.. నేడు భూ యాజమాన్య హక్కు పత్రాలు పంపిణీ

Good news for AP farmers.. Distribution of land ownership right documents today
Good news for AP farmers.. Distribution of land ownership right documents today

ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. నేడు భూ యాజమాన్య హక్కు పత్రాలు పంపిణీ జరుగనుంది. ఏలూరు జిల్లా నూజివీడు పర్యటన ఫిక్స్ ఐంది. నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా నూజివీడు పర్యటనకు బయలు దేరనున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పర్యటనలో 2003 కు మందు అసైన్‌మెంట్‌ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్‌ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

ఈ సందర్బంగా 27.41 లక్షల ఎకరాలపై పేదలకు యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు సీఎం జగన్. నిరుపేదలకు కొత్తగా 46 వేల ఎకరాల పంపిణీ జరుగనుంది.లంక భూములకు అసైన్‌మెంట్‌ పట్టాలు ఇవ్వనున్నారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాల కేటాయింపు చేయనున్నారు. ఇందులో భాగంగానే ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్‌ బయలుదేరనున్నారు. నూజివీడులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం రానున్నారు.