“కేజీయఫ్ 3”, “సలార్ 2” లపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్..!

Prashant Neel gave the latest update on "KGF-3", "Salar 2"..!
Prashant Neel gave the latest update on "KGF-3", "Salar 2"..!

కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఒక్క దక్షిణాది మూవీ దగ్గర మాత్రమే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా కూడా తన మూవీ లకి భారీ మార్కెట్ ని తెచ్చుకున్నాడు. అలా తన కేజీయఫ్ రెండు మూవీ లు అలాగే సలార్ మూవీ లతో సత్తా చాటాడు. ఇక ఈ మూవీ ల తో యష్, ప్రభాస్ ల కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ గ్రాసర్ లని అందించిన ప్రశాంత్ నీల్ లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రానున్న అవైటెడ్ సీక్వెల్ మూవీ లు “కేజీయఫ్ చాప్టర్ 3” అలాగే “సలార్ 2” లపై సాలిడ్ అప్డేట్ అందించాడు.

మరి సలార్ 2 ను అయితే ప్రస్తుతం తాను చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసాడు. అలాగే కేజీయఫ్ 3 పై కూడా మాట్లాడుతూ దానికి స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ పూర్తయ్యిపోయింది అని కాకపోతే ఇప్పుడు యష్ కు ఉన్న కమిట్మెంట్స్, అలాగే ప్రొడ్యూసర్ విజయ్ కు ఉన్న కమిట్మెంట్స్ తో ఇంకా మూవీ చేయడానికి కాస్త సమయం పడుతుంది అని తెలియచేసాడు .

Prashant Neel gave the latest update on "KGF-3", "Salar 2"..!
Prashant Neel gave the latest update on “KGF-3”, “Salar 2”..!

ఖచ్చితంగా “కేజీయఫ్ చాప్టర్ 3” ఉంటుంది అని తెలిపాడు. మళ్ళీ సలార్ నుంచి కేజీయఫ్ లోకు రావడానికి నేను కొంచెం బ్రేక్ తీసుకోవాలి అనుకుంటున్నాను అని అందుకే ముందు సలార్ 2 పూర్తి చేసి ఆ తరువాత హీరో, నిర్మాతల కలయికలో కేజీయఫ్ 3 చేస్తానని తెలిపారు . దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.