పవన్ కళ్యాణ్: రాష్ట్రాన్ని రామరాజ్యం దిశగా నడిపిస్తా

ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు దూసుకుపోతున్నారు. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అధినేత్రి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారంలో సందడి చేస్తున్నారు. జిల్లాల వారీగా పర్యటిస్తూ కేడర్‌ను ఆకట్టుకునేలా వ్యూహాలు పన్నుతున్నారు. ఆ క్రమంలోనే… జనసేన అభ్యర్థులకు పవన్ కల్యాణ్ బుధవారం బీ ఫారం అందజేశారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో 21 మంది ఎంపీలు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు ఫారాలు అందజేశారు.

నాదెండ్ల మనోహర్‌కు తొలి బీఫామ్‌ను అందజేశారు పవన్‌కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేశారు. అవినీతి పాలనను అంతమొందించేందుకే మహాకూటమి ఏర్పడిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు బాధ్యతగా ఉంటాం. శ్రీరామ నవమి సందర్బంగా అభ్యర్థులకు బిఫారమ్‌లను అందజేయడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని రామరాజ్యం దిశగా నడిపిస్తానని అన్నారు.