తగ్గేదే లే …జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం : వైవీ సుబ్బారెడ్డి

No less... Jagan swearing in on June 9 : YV Subbareddy
No less... Jagan swearing in on June 9 : YV Subbareddy

జగన్ ప్రమాణ స్వీకారానికి తేదీతో పాటు టైమ్ కూడా ఫిక్స్ చేశారు వైవీ సుబ్బారెడ్డి గారు . తాజాగా మీడియాతో వై.వి.సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. జూన్ 9 ఉదయం 9 నుండి 11 లోపు జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం విశాఖలోనే ఉంటుందని ప్రకటించారు వైవీ సుబ్బారెడ్డి గారు ,.

No less... Jagan swearing in on June 9 : YV Subbareddy
No less… Jagan swearing in on June 9 : YV Subbareddy

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు ఎంత విశ్వాసంతో ఉన్నారో పోలింగ్ రోజు చూసామని ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో ఎండలని వానలని లెక్కచేయకుండా వచ్చి ఓటు వేశారంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అని ఆయన తెలిపారు. అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి గారు .