సెన్సార్ పూర్తి చేసుకున్న “ప్రతినిధి 2”మూవీ ..!

Censor completed
Censor completed "Representative 2" movie ..!

నారా రోహిత్ ప్రధాన పాత్రలో, ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా మూవీ ప్రతినిధి 2. ప్రతినిధి ఫ్రాంచైజీలో ప్రతినిధి 2 రెండవ మూవీ . ప్రతినిధి 2 మూవీ మే 10న థియేటర్ల లోకి రానున్నది . ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి మూడు రోజుల ముందు ఈ మూవీ విడుదల కాబోతుంది . మరి ఈ మూవీ ప్రేక్షకులని అలరిస్తుందో లేదో చూడాలి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. ఈ మూవీ రన్ టైమ్ ని ఫిక్స్ చేసుకుంది.136 నిమిషాల నిడివి తో మూవీ ఉండనుంది.

మూవీ నుండి రిలీజైన టీజర్, ట్రైలర్‌కి మంచి ఆదరణ లభించింది. నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్‌గా నటించాడు. సిరీ లెల్లా కథానాయికగా నటించగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాను వానరా ఎంటర్టైన్మెంట్స్ మరియు రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజ బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట మరియు సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించగా, మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందించారు.