పిక్‌టాక్‌ : నారా రోహిత్‌ ఇలా అయ్యాడు ఏంటి?

Nara Rohith's Balakrishnudu first look released

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నారా రోహిత్‌ ప్రస్తుతం ‘బాలకృష్ణుడు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో నారా హీరో సిక్స్‌ ప్యాక్‌తో కనిపించబోతున్నాడు. ఆ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రోహిత్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు అన్ని సినిమాల్లో కూడా నారా రోహిత్‌ ఒకే మాదిరిగా నటించాడు. కాని ఈ సినిమాలో మాత్రం పూర్తి విభిన్నంగా సిక్స్‌ ప్యాక్‌తో కనిపిస్తున్నాడు. నేడు నారా రోహిత్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ‘బాలకృష్ణుడు’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ ఫస్ట్‌లుక్‌లో కనిపిస్తున్నది అసలు నారా రోహితేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇటీవలే షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ సినిమా నారా రోహిత్‌ కెరీర్‌లో ఒక మైలు రాయి చిత్రం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇంత విభిన్నంగా కనిపించడంపై సినీ వర్గాల వారు కూడా అంతా షాక్‌ అవుతున్నారు. నారా రోహిత్‌ అంటే నమ్మశక్యం కాని విధంగా పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడయ్యే అవకాశం ఉంది. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న నారా రోహిత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మంచి సినిమాలు ఆయన చేయాలని మేము కోరుకుంటున్నాం.

మరిన్ని వార్తలు

ముమైత్‌ ఖాన్‌ వస్తానంది.. ఎలా?