బిగ్‌బాస్‌ : సౌత్‌లో నమితకు అరుదైన రికార్డ్‌

Namitha Takes Highest Remuneration In Big Boss Show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

హిందీలో సూపర్‌ సక్సెస్‌ అయిన బిగ్‌బాస్‌ షోను సౌత్‌లో కూడా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. కన్నడం, తమిళంలో ఇది వరకు ప్రారంభం అయిన బిగ్‌బాస్‌ షో తెలుగులో గత వారం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం రెండవ వారం కొనసాగుతున్న విషయం తెల్సిందే. బిగ్‌బాస్‌ ఇంట్లో సెలబ్రెటీలు 70 రోజులు ఉంటారు. ఆ 70 రోజుల్లో వారంకు ఒక్కరు ఒక్కరు చొప్పున ఎలిమినేట్‌ అవుతూ ఉంటారు. అందుకే అందులో పాల్గొనే సెలబ్రెటీలకు వారంకు ఇంత అనే పారితోషికం ఫిక్స్‌ చేస్తారు. సౌత్‌లో అత్యధికంగా బిగ్‌బాస్‌ కోసం పారితోషికం తీసుకుంటున్న సెలబ్రెటీగా నమిత రికార్డు సాధించింది.

తమిళంలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ షోలో ఈమె పాల్గొంటుంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా నమితకు అమితంగా ఆధరణ ఉంది. సినిమాలు ఇటీవల కాస్త తగ్గించినా కూడా ఆమె హాట్‌ అందాలతో, ఆమె ఫొటో షూట్‌లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు పలకరిస్తూనే ఉంటుంది. అలాంటి నమిత బిగ్‌బాస్‌ షోలో చేసేందుకు వారంకు ఏకంగా 30 లక్షలు పుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌ సెలబ్రెటీలకు అత్యధికంగా 15 లక్షలు అనే ప్రచారం జరుగుతుంది. నమిత నిర్వాహకులు ఆశించినట్లుగానే అమితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరిన్ని వార్తలు:

కన్ఫర్మ్‌ : నవదీప్‌ డ్రగ్స్‌ తీసుకున్నాడు..

 కొరటాల జెట్‌ స్పీడ్‌ మీదున్నాడుగా..!