రష్మిక మాజీ ప్రియుడితో పోటీగా దేవరకొండ..?:

Vijay Devarakonda
Vijay Devarakonda

టాలీవుడ్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలలో అత్యధిక వంటి క్రేజ్ ఉన్న నటుడిగా విజయ్ ఉన్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి మూవీతో సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

ఈ సినిమా సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో మూవీపై అంచనాలు అమాంతంగా పెరిగాయి.తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా శివ నిర్వాణ నుంచి మరో ఇంటరెస్టింగ్ లవ్ స్టోరీ కూడా రాబోతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. లైగర్ సినిమాతో నార్త్ ఇండియాలో కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ బాగా పెంచుకున్నారు. సమంతకి తమిళంలో మంచి ఇమేజ్ ఉంది.

అలాగే మలయాళం లో హేషమ్ అబ్దుల్ వహాబ్ మూవీ ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇలా పాన్ ఇండియా బ్రాండింగ్ తోనే ఖుషికి మంచి హైప్ ఉంది.ఈ చిత్రానికి పోటీగా కన్నడంలో రక్షిత్ శెట్టి సప్త సాగర దాచే ఎల్లో అనే మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. కన్నడనాట ఈ యంగ్ హీరో మోస్ట్ సక్సెస్ ఫుల్ యాక్టర్ గా దూసుకుపోతున్నాడు.

చార్లీ మూవీతో ఇప్పటికే సూపర్ హిట్ కొట్టారు. దీని తర్వాత సప్త సాగర దాచే ఎల్లో మూవీ వస్తోంది. అయితే మామూలుగా చూస్తే ఇదేమీ పెద్ద మ్యాటర్ కాదు. కాని రష్మిక మందన వీరిద్దరి లైఫ్ లో ఇంటరెస్టింగ్ ఫ్యాక్టర్కిరీక్ పార్టీతో హీరోయిన్ గా పరిచయం అయిన రష్మిక మందన ఆ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.

తరువాత రష్మిక తెలుగులో చలో మూవీతో ఎంట్రీ ఇచ్చి విజయ్ దేవరకొండతో గీతాగోవిందం మూవీ చేసింది. వెంటనే డియర్ కామ్రేడ్ మూవీ కూడా చేసింది. ఈ రెండు చిత్రాల సమయంలో రష్మిక విజయ్ కి దగ్గరైందనే టాక్ ఇప్పటికి ప్రచారంలో ఉంది. దీనికి కారణం అదే సమయంలో రష్మిక ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కూడా.విజయ్ దేవరకొండతో వెకేషన్స్ కి వెల్తూ అప్పుడప్పుడు మీడియాకి రష్మిక చిక్కుతుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం రష్మిక బాయ్ ఫ్రెండ్ తో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి మూవీ సెప్టెంబర్ 1న పోటీ పడుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రిలీజ్ కాంపిటేషన్ కేవలం హీరోల పాయింట్ లోనే నడిస్తే ఓకే కానీ రష్మిక సెంటర్ పిల్లర్ గా చూస్తే మాత్రం కన్నడ ఆడియన్స్ మొదటి ప్రయారిటీ రక్షిత శెట్టి ఉండటమే అన్నమాట వినిపిస్తుంది.