మనమే” నుండి ఆకట్టుకుంటున్న సాంగ్ “ఇక నా మాటే “..!

Impressive song
Impressive song "Ika Na Mate" from Maname..!

టాలీవుడ్ హీరో శర్వానంద్ వరుస మూవీ లు చేస్తూ, కెరీర్ లో దూసుకు పోతున్నారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా మనమే. ఈ మూవీ అనౌన్స్ మెంట్ తోనే అందరిలో ఆసక్తి నెలకొంది. కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వహబ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిభోట్ల సంయుక్తం గా నిర్మిస్తున్నారు.

ఈ మూవీ కి సంబందించిన ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ నేడు రిలీజ్ చేయడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్ధుల్ వహబ్ పాడిన ఇక నా మాటే పాటకి క్రిష్ణ చైతన్య లిరిక్స్ రాశారు. పాట ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శర్వానంద్ స్టైల్ మరియు లుక్ సరికొత్తగా ఉండటం మాత్రమే కాకుండా, ఆకట్టుకుంటున్నాయి. శర్వానంద్ కెరీర్ లో 35 వ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

సాంగ్ ని మీరు కూడా ఒక లుక్ వేసుకోండి :