Election Updates: యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు: చంద్రబాబు

Election Updates: TDP chief Chandrababu's visit to East Godavari district today
Election Updates: TDP chief Chandrababu's visit to East Godavari district today

యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని అన్నారు టీడీపీ అధినేత. చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. “చదువుకున్న యువతకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? యువత మేలుకోవాలి.. రోడ్ల మీదకి రావాలి. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎన్డీయేకు ఓటు వేయాలి. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చెప్పే వ్యక్తి జగన్. ఆయనో అబద్ధాల కోరు. బోగస్ సర్వేలు చేయిస్తారు. రాజకీయాలకు పనికిరాడు. పేదల మనిషి ఎవరో.. పెత్తందారు ఎవరో ప్రజలు తెలుసుకోవాలి. మేం ప్రారంభించామనే అన్న క్యాంటీన్లు రద్దు చేశారు.

అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తీసుకొస్తాం. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుంది. ఐదేళ్ల ప్రజల ఆవేదన.. వచ్చే ఎన్నికల్లో అగ్నిగా మారాలి. మేం ఉన్నప్పుడు ఐదేళ్లపాటు కరెంట్ ఛార్జీలు పెంచలేదు. పేదల కష్టాలు ఏమాత్రం తెలియని వ్యక్తి జగన్. రూ.60ల మద్యాన్ని రూ.200లకు అమ్ముతున్నారు. ఈ ఐదేళ్లలో మీ ఆదాయం పెరిగిందా.. తగ్గిందా? పేదలను నిరుపేదలుగా మార్చిన పెత్తందారు జగన్. పేదల జీవితాల్లో వెలుగులు చూపించే బాధ్యత నాది. మహిళలను వేదించిన వారు బాగుపడినట్లు ఎక్కడా లేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు.