శర్వానంద్ కొత్త మూవీ టీజర్ వచ్చేసింది …ఏంటో తెలుసా ..?

Sharwanand's new movie teaser is out ... do you know what ..?
Sharwanand's new movie teaser is out ... do you know what ..?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ మనమే’. ‘ఒకే ఒక జీవితం’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొన్న శర్వా ఇప్పుడు ఈ మూవీ తో త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నారు . ఈ నేపథ్యంలో ఇవాళ ఈ మూవీ కి సంబంధించి మూవీ టీమ్ టీజర్ ని రిలీజ్ చేసింది. భలే ఆసక్తికరంగా చాలా ఫన్నీ గా ఈ టీజర్ సాగిపోయింది. మంచిగా కనిపించే వాళ్లందరు మంచోళ్లు కాదురగా.. ఫర్ ఎగ్జాంపుల్ నేను.. మంచిగా కనిపిస్తా.. కానీ మంచోణ్నా కాదు.. అని అంటూ శర్వా చెప్పే డైలాగ్ తో ఈ మూవీ టీజర్ మొదలైంది.

Sharwanand's new movie teaser is out ... do you know what ..?
Sharwanand’s new movie teaser is out … do you know what ..?

 

ఇక లండన్, యూరప్ బ్యాక్​డ్రాప్​పై ఈ కథ సాగుతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తుంది . హీరో మంచివాడిగా కనిపించే బ్యాడ్​ బాయ్ అంటూ చెప్పుకుంటుండగా.. అనుకోకుండా ఆయనకి హీరోయిన్​ పరిచయమవుతుంది. వారి జీవితంలోకి ఒక బాబు వచ్చాక ఆ ఇద్దరి లైఫ్​ ఎలా సాగిందన్న విషయంపై సినిమా రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది . ఆ బాబు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కుమారుడని కూడా టాక్ వస్తుంది .