శర్వానంద్: టాలెంటెడ్ డైరెక్టర్ తో కలిసి మరొక మూవీ ..!

Sharwanand: Another movie with talented director..!
Sharwanand: Another movie with talented director..!

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ ఇప్పుడు దర్శకుడ్ శ్రీరామ్ ఆదిత్యతో ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ “మనమే” అనే కలర్ ఫుల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీ తర్వాత మరిన్ని ఆసక్తికర మూవీ లు తాను తన లైనప్ లో పెట్టుకున్నాడు. అయితే ఈ లైనప్ లో ప్రముఖ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి వచ్చినట్టుగా సినీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది.

Sharwanand: Another movie with talented director..!
Sharwanand: Another movie with talented director..!

మరి సంకల్ప్ రెడ్డి చేసింది తక్కువ మూవీ లే అయినప్పటికీ కొత్తదనం కోరుకునే టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ముద్ర వేసుకున్నాడు. ఘాజీ, అంతరిక్షం లాంటి వినూత్న మూవీ ల తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాను మళ్ళీ తెలుగులో కొత్త మూవీ చేయడానికి సమయం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఫైనల్ గా శర్వానంద్ హీరోగా భారీ మూవీ లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మూవీ ని పాన్ ఇండియా భాషల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది.