Weather Report: తెలంగాణ వాసులకు ఐఎండీ అలర్ట్.. రాగల 5రోజులు వర్షాలు

Weather Report: IMD Alert for Telangana Residents.. 5 Days of Rains
Weather Report: IMD Alert for Telangana Residents.. 5 Days of Rains

ఎండలతో భగభగలాడిపోతున్న తెలంగాణ వాసులకు చల్లని కబురు చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న 5రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ద్రోణి / గాలి విచ్చిన్నతి ఉత్తర గుజరాత్ నుంచి మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ. ఎత్తులో కొనసాగుతోందని వెల్లడించారు. దీని ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో గత రెండు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని మరో 5 రోజుల పాటు ఉష్ణోగ్రతల ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. మంగళవారం రోజున ఖమ్మం, మెదక్‌ మినహా అన్నిచోట్లా సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 40.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.