SSMB29 మూవీ లేటెస్ట్ న్యూస్ .. వీడియో వైరల్…!

SSMB29 Movie Latest News .. Video Viral...!
SSMB29 Movie Latest News .. Video Viral...!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మాత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా.. ఇందులో భాగంగానే చిత్ర బృందం కొన్నిరోజుల క్రితం దుబాయ్‌కి వెళ్లింది. అయితే అక్కడ పనులు ముగించుకుని తాజాగా టీమ్ హైదరాబాద్‌కి చేరుకుంది. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న ఈ టీమ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహేశ్‌బాబు-రాజమౌళిని ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు ఫుల్ ఖుష్ కూడా అయ్యారు.

SSMB29 Movie Latest News .. Video Viral...!
SSMB29 Movie Latest News .. Video Viral…!

ముఖ్యంగా లాంగ్ హెయిర్, గడ్డంతో మహేశ్ బాబు లుక్ కూడా అదిరిపోయింది. ఈ మూవీ లో మహేశ్ బాబు ఇదే లుక్ లో కనిపించబోతున్నారని నెటిజన్లు అంటున్నారు. లుక్‌ టెస్ట్‌లో భాగంగానే ఈ చిత్ర బృందం దుబాయ్‌కి వెళ్లినట్లు సమాచారం. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. దీనికి ‘మహారాజ్‌’ (Maharaj) అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు టాక్‌.