రజినీ నెక్స్ట్ లో ఈ యంగ్ హీరో కూడా?

Superstar Rajinikanth
Superstar Rajinikanth

ఇప్పుడు కోలీవుడ్ లో తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ” జైలర్ “హిట్ తో ఇప్పుడు తలైవర్ ఫ్యాన్స్ కూడా సూపర్ హ్యాపీగా అయితే ఉన్నారు.ఇక ఇదిలా ఉండగా నెక్స్ట్ రజినీ చేయబోయే చిత్రాలు కోసం అంత ఆసక్తిగా చూస్తుండగా వాటిలో టాలెంటెడ్ దర్శకుడు టీ జి జాన్వెల్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రం కూడా ఒకటి.

మరి ఈ చిత్రం అయితే ఓ భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కనుండగా ఈ చిత్రంలో మన టాలీవుడ్ నుంచి నాచురల్ స్టార్ నాని ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టుగా టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. దీనితో ఈ చిత్రంలో మరో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ముఖ్య పాత్ర చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.