డియ‌ర్ కామ్రేడ్ ట్రైల‌ర్ విడుద‌ల‌

dear comrade trailer

టాక్సీవాలా చిత్రం త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్ర డియ‌ర్ కామ్రేడ్‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్ . దక్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో ఈ సినిమా జూలై 26న రిలీజ్ కానుంది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ద‌క్షిణాది మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంథాన కథానాయిక‌గా న‌టించింది. గ‌త కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన సాంగ్స్ విడుద‌ల చేస్తూ మూవీపై మ‌రింత ఆస‌క్తి పెంచారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ఫ‌న్, ఫ్ర‌స్ట్రేష‌న్, ల‌వ్‌, ఎమోష‌న్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఈ ట్రైల‌ర్‌పై ఓ లుక్కేయండి.