త‌న తాజా చిత్రానికి డ‌బ్బింగ్ మొద‌లుపెట్టిన బన్నీ

allu arjun started dubbing for his movie

అల్లు అర్జున్ త‌న 19వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమాను 2020 సంక్రాంతికి విడుదలచేనున్నట్లు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. త్రివిక్రమ్ శైలిలో కుటుంబ బంధాలు, వినోదం, భావోద్వేగాల సమ్మిళితంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఇందులో అల్లు అర్జున్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపించనున్నట్లు తెలిసింది. ఇటీవల హైదరాబాద్‌లో ఆయనపై కీలక ఘట్టాలను చిత్రబృందం తెరకెక్కించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా పి.ఎస్. వినోద్ ఛాయాగ్రహణాన్ని సమకూర్చుతున్నారు. అయితే ఈ చిత్రానికి బ‌న్నీ డ‌బ్బింగ్ కూడా మొద‌లు పెట్టాడ‌ని తెలుస్తుంది. డ‌బ్బింగ్‌కి ముందు ప‌లు పూజా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.