బాలీవుడ్‌లో రీమేక్ కానున్న స‌మంత చిత్రం

samantha movie remaking in bollywood

ఇటీవ‌లి కాలంలో సౌత్ హిట్ చిత్రాల‌న్నీ బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా తెలుగులో మంచి విజ‌యం సాధించిన ఓ బేబి చిత్రం కూడా హిందీలో రీమేక్ కానుంద‌ని అంటున్నారు. ఈ చిత్రంలో రానా ప్ర‌ధాన పాత్ర పోషించ‌నుండ‌గా, స‌మంత పాత్ర‌లో కంగ‌నా లేదా అలియా న‌టిస్తారని టాక్. బాలీవుడ్ దర్శ‌క నిర్మాత‌లు ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ట‌. ఓ బేబి చిత్రం కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో రావు ర‌మేష్‌, ల‌క్ష్మీ, తేజ‌, రాజేంద్ర ప్ర‌సాద్‌లు కీల‌క పాత్ర‌లు పొషించారు. 70 ఏళ్ల వృద్దురాలు తిరిగి య‌వ్వ‌నంలోకి వ‌స్తే ఎలాంటి పరిణామాలు జరిగాయి అన్న నేప‌థ్యంతో ఈ చిత్రం తెర‌కెక్కింది.ఈ చిత్రం హిందీ ప్రేక్ష‌కుల‌ని కూడా త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని అంటున్నారు.