సికింద్రాబాద్ స్టేషన్ వైఫై @ 4

secunderabad station wifi

ఉచిత వైఫై వినియోగంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దేశంలోనే నాలుగోస్థానంలో ఉన్నది. ఇక్కడ వైఫై వినియోగిస్తున్న ప్రయాణికుల సంఖ్య సగటున నెలకు 10 లక్షలు. 2016 జనవరిలో ముంబై రైల్‌వైర్ పేరిట ఉచిత వైఫై సౌకర్యం ప్రారంభించారు. 26 నెలల్లో భారతీయ రైల్వేలోని 1600 స్టేషన్లకు దీనిని విస్తరించారు. ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వేలోని 36 ప్రధాన రైల్వేస్టేషన్లు, 171 చిన్నస్టేషన్లు కలిపి 207 స్టేషన్లలో వైఫై సౌకర్యం ఉన్నది. స్టేషన్లలో వైఫై ఉపయోగించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఉచిత వైఫై సౌకర్యంతో 30 నిమిషాల వ్యవధిలో ఒక్కో వినియోగదారుడు సగటున 343 ఎంబీ డాటా వాడుతున్నారు.